పుటాన్ దొడ్డి గ్రామంలో అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం

In Puthan Doddai village, cultural artists raised awareness about literacy through songs and plays, emphasizing education's value and encouraging school enrollment for children. In Puthan Doddai village, cultural artists raised awareness about literacy through songs and plays, emphasizing education's value and encouraging school enrollment for children.

ఇటిక్యాల మండలం పుటాన్ దొడ్డి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం డిపిఆర్ఓ సారథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లా సాంస్కృతిక సారథి కళాకారులు అక్ష్యరాస్యత పై ఆటపాటల ద్వారా గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. సమాజంలో చదువు యొక్క విలువ చదువుకుంటే మనిషి యొక్క భవిష్యత్తు విలువ ఆటపాట మాటలు ద్వారా అవగాహన కల్పించారు. ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి చిన్నారులను బడిలో చేర్పించాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పత్తి చేనులకు పంపివ్వకుండా, పాఠశాలకు పంపివ్వాలని కోరారు. చిన్న వయసులో పిల్లలను ప్రతి పొలాలకు తీసుకెళుతున్న సమయంలో వారు పడే బాధలను ఆటపాటల ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపించారు. అదేవిధంగా బాల కార్మిక నిర్మూలన చట్టం గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సారథి కళాకారులు కేశవులు కృష్ణ కవిత భూపతి నాయుడు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *