మంత్రాల పేరుతో దాడులు చేసిన కుల బహిష్కరణ చేసిన చట్టపరమైన చర్యలు ఉంటాయని రామాయంపేట తహసిల్దార్ రజనీకుమారి, ఎస్ఐ బాలరాజు తెలిపారు, రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ప్రజావాణి కార్యక్రమంలో కుల బహిష్కరణ చేశారని ఫిర్యాదు రావడంతో స్పందించిన అధికారులు జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు గ్రామంలో గ్రామ సభ నిర్వహించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ చట్ట ప్రకారం ఎవరైనా కుల బహిష్కరణ చేసిన మూఢనమ్మకాలతో దాడులు నిర్వహించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు హెచ్చరించారు, మంత్రాలు అనేటివి లేవని కేవలం అది మన అపోహాయని అనవసరంగా ఒకరిపై మంత్రాలు చేస్తున్నారని అపోహతో దాడి చేస్తే దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు
కుల బహిష్కరణపై చట్టపరమైన చర్యలు
Officials emphasize legal measures against caste-based violence and superstition, ensuring community awareness and protection from discrimination.
