గిరిజన యువకుడి మృతికి స్పందించిన నేతలు

Leaders visited the family of a tribal youth who died under tragic circumstances, demanding strict punishment for those responsible and expressing concerns over safety and governance in the state. Leaders visited the family of a tribal youth who died under tragic circumstances, demanding strict punishment for those responsible and expressing concerns over safety and governance in the state.

ఇటీవల పాలకుర్తి పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసుకొని మరణించిన గిరిజన యువకుడు లకావతు శ్రీను స్వగ్రామం కొండాపురం మేకల తండా ను, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శాసనమండలి పక్ష నేత మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సందర్శించారు. మృతుడు శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి శ్రీను చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
శ్రీను మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకత్వంలో పాలకుర్తిలో మహా ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీనివాస్ ది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని, రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *