శ్రీకాకుళం జిల్లా రాగోలు గ్రామీణం రాగోలు గ్రామం పెట్రోల్ బంకు సమీపంలో ఉన్న 80 సెంట్ల స్థలం స్థలంకు 1982 సెప్టెంబర్ 4న లచ్చిరెడ్డి హరినాథ్ బాబా అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ చేయకపోవడం వలన స్పెసిఫిక్ అగ్రిమెంట్ పర్ఫామెన్స్ ఆఫ్ అగ్రిమెంట్ కింద ఓ ఎస్ నెంబర్ 76/85 కింద కేసును నమోదు చేయడం జరిగింది. శ్రీకాకుళం అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి 1991 ఫిబ్రవరి 8న లచ్చిరెడ్డి హరినాథ్ బాబాకు అనుకూలంగా తీర్పునిచ్చారు. ఆ తీర్పుపై దంగేటి గణపతిరావు అప్పిల్ కు (53/91) వెళ్లారు. అప్పిలు పెండింగ్ లో ఉండగానే గణపతి రావు మృతి చెందారు.
వారసులను ఎప్పిలి ఎంట్లుగా చేర్చి 1998 జూన్ 29న అప్పిలి డిస్మిస్ చేశారు. లోవర్ కోర్టు తీర్పును కన్ఫర్మ్ చేశారు. దంగేటి గణపతిరావు వారసులు సెకండ్ అప్పిల్ కు హైకోర్టుకు వెళ్లారు. అపిల్ నెంబర్ 497/2001 సెకండ్ అప్పీల్ని కూడా 2014 జూన్ 27న కోర్టు కొట్టి వేసింది. మా నాన్న అయినటువంటి లచ్చిరెడ్డి హరినాథ్ బాబా మృతి చెందడం వలన ఆయన వారసులైన మాకు EP 10/09 in 76/85 ప్రకారం గంగేటి గణపతిరావు వారసులు క్రయ చీటీ జరపమని EP వేశాం. వాళ్లు జరపనందున వాళ్ళ స్థానంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీకాకుళం మేరీ గ్రేసి కుమారి రిజిస్ట్రేషన్ చేశారు. తమకు కోర్టు ఆర్డర్ ఇచ్చిందని అయినప్పటికీ కొందరు పనిగొట్టుకొని దుష్ప్రచారం చేయడం తగదని స్థల యజమానులు చెబుతున్నారు.
ఈ మేరకు వారు రాగోలులోని తమ స్థలం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత భూ యజమానులు మాట్లాడుతూ రాగోలు ప్రధాన రహదారిలో పెట్రోల్ బంకు వద్ద లచ్చిరెడ్డి శ్రీ హరనాథ్‌బాబా కుటుంబ సభ్యుల పేరుపై సుమారు 80 సెంట్ల స్థలం ఉందని చెప్పారు. ఆయన కుటుంబం దాదాపు 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వలస వెళ్లిపోయారని వివరించారు. గణపతిరావు అగ్రిమెంట్ కాలపరిమితి ఉండగానే మరో నలుగురి పార్టీలకు విక్రయించేశారని స్పష్టం చేశారు. అగ్రిమెంట్ ఉందన్న విషయం తెలిసినప్పటికీ సదరు నలుగురు పార్టీలు తక్కువ ధరకే స్థలం వస్తుందన్న అత్యాశతో భూమిని కొనుగోలు చేశారని పేర్కొన్నారు. మిగిలిన కొనుగోలు దారులు ఈ స్థలం తమకే చెందుతుందని చెబుతూ ఎప్పటికప్పుడు దౌర్జన్యాలకు దిగుతున్నారని తెలిపారు. దీంతో అసలు యజమానులు తమకు చెందిన స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నారని, విషయం తెలుసుకున్న కబ్జాదారులు కొందరు రౌడీమూకలతో స్థలం వద్దకు వచ్చి మారణాయుధాలతో బెదిరింపులకు పాల్పడి నిర్మించిన గోడలను దౌర్జన్యంగా తొలగించేసి యజమానికి ఆస్తినష్టం కలిగించారని అన్నారు.
హరనాథ్‌బాబా బంధువులు, స్థానికంగా ఉన్న స్నేహితులు స్థలం వద్ద జరుగుతున్న దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా సదరు రౌడీమూకలు వారిపై కూడా దాడులకు పాల్పడుతూ మారణాయుధాలతో దౌర్జన్యాలకు దిగుతున్నారని భయాందోళన వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ స్థలానికి సంబంధించి కోర్టు ద్వారా దఖలు పడిందని చెప్పినప్పటికీ రౌడీమూకలు పోలీసులు, తదితర అధికారుల మాటలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా విచక్షణ కోల్పోయి గోడలను తొలగించారని వివరించారు.
ఎవరు వచ్చినా చంపేస్తామంటూ తీవ్ర ఘర్షణ వాతావరణ సృష్టించడంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారని తెలిపారు. మా స్థలంలో ఉన్నటువంటి కంటినర్ కూడా దౌర్జన్యంగా తొలగించేశారు. ఇదే విషయమై ఇటీవల మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నల్ దినకర్ గారిని, జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి గారిని కలిసి చెప్పడం జరిగిందని వివరించారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేసి తమకు సంబంధించిన భూమిని తమకు అప్పగించి రౌడీమూకల నుంచి రక్షణ కల్పించాలని హరనాథ్‌బాబా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 1982లో అగ్రిమెంట్ చేసుకుని అప్పటినుంచి అనేక కోర్టుల్లో పోరాటం చేసి తమ స్థలాన్ని దక్కించుకుని తమ స్వాధీన అనుభవంలో ఉన్నటువంటి సర్వేనెంబర్ 233/1లో ఉన్న భూమిపై ప్రస్తుతం కొందరు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం రాజకీయ రంగు పులమడం విడ్డూరంగా ఉందని సంబంధిత భూ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు సోషల్ మీడియా వేదికగా ఈ స్థలంపై దుష్ప్రచారాలను చేస్తున్నారని దయచేసి వాటిని ఎవరూ నమ్మవద్దని భూ యజమానులు కోరుతున్నారు.
