కోవూరు మండల కేంద్రంలోని జేబీఆర్ హైస్కూల్‌లో జరిగిన 68వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్‌లో సాత్విక్, ప్రీతి అన్నాచెల్లెళ్లు తమ ప్రతిభను ప్రదర్శించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. ఈ క్రీడా విజయాన్ని పురస్కరించుకుని, వారిని పాఠశాలలో సన్మానించిన కోవూరు ఉప ఎంపీపీ శివుని నరసింహారెడ్డి వారికి బహుమతిగా ఒక్కొక్కరికి 5000 రూపాయలు చొప్పున, మొత్తం పదివేల రూపాయలు అందజేశారు.
సాత్విక్, ప్రీతి జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ చాటాలని, వారి విజయాలతో జిల్లాకు మంచి పేరు తెచ్చుకోవాలని నరసింహారెడ్డి అభినందించారు. పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు సాత్విక్, ప్రీతి విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు షరీఫ్, పీడీ డిలీల, పీఈడీ సాయి, విజయ్, భరద్వాజ్, రామకృష్ణ తదితరులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
