అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గునుపూడి గ్రామానికి చెందిన కొండ్రు మరిడియ్య రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నర్సీపట్నం ఏ వన్ టీవీ ప్రతినిధి శ్రీనివాసరావుతో మాట్లాడారు. సామాజిక వర్గంలోని అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువ చేయడమే తన ప్రధాన లక్ష్యమని మరిడియ్య చెప్పారు.
తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాష్ట్ర యువ నాయకుడు నారా లోకేష్, మరియు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పదవిని తనకు అప్పగించడం ద్వారా నాయకత్వం తనపై చూపిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు.
మాలల సంక్షేమానికి విశేషమైన కృషి చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. పేదలకు ప్రభుత్వ పథకాల లబ్ధి అందించడానికి తక్షణం చర్యలు చేపడతానని స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్య, ఉపాధి రంగాల్లో వనరులను అందించడంపై దృష్టి పెట్టబోతున్నట్లు తెలిపారు.
తన నియామకాన్ని సామాజిక సమానత్వం మరియు సంక్షేమానికి పెద్ద అడుగు అంటూ అభివర్ణించారు. తన సామాజిక వర్గానికి విశేష సేవలందించేందుకు ఈ పదవిని ఉపయోగిస్తానని హామీ ఇచ్చారు.

 
				 
				
			 
				
			 
				
			