రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డో అసోసియేషన్ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చేతులమీదుగా కరాటే బెల్ట్ గ్రీటింగ్ టెస్ట్ ప్రారంభోత్సవం నిర్వహించబడింది.
ఈరోజు హైదరాబాద్ గాంధీ భవన్ లో TPCC ప్రెసిడెంట్ గౌరవనీయులు బొమ్మ మహేష్ గౌడ్ గారిని డ్రగన్ షోటో ఖాన్ కరాటే డో స్పోర్ట్స్ చీప్ అడ్వైజర్ మల్లికార్జున్ గౌడ్ మరియు కరాటే వ్యవస్థాపకులు సలాం బిన్ ఉమర్ కలవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మక్తల్ ప్రాంతంలో నవంబర్ 17న అతిపెద్ద కరాటే బెల్ట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కరాటే బెల్ట్ టెస్ట్ లో 4000 నుంచి 5000 విద్యార్థుల పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కచ్చితంగా నవంబర్ 17న చీఫ్ గెస్ట్ గా మక్తల్ ప్రాంతానికి విచ్చేస్తానని బొమ్మ మహేష్ గౌడ్ తెలియజేశారు.
రాబోయే కాలంలో కరాటే కు ప్రాముఖ్యమైన పాత్ర ఉంటుందని, యువత కోసం ఇది మంచి అవకాశమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మల్లికార్జున్ గౌడ్, నాయిముద్దీన్ సహాబ్, షేక్ అబ్దుల్ సలాం మరియు ఇతర కరాటే మాస్టర్స్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు కరాటే అభివృద్ధి పై తమ అభిప్రాయాలను పంచుకున్నారు, మరియు సమాజానికి కరాటే యొక్క ఉపయోగాలను వివరించారు.

 
				 
				
			 
				
			