సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది గ్రామంలో వెలసియున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దేవాదాయ ధర్మాదాయ శాఖ రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ కె. సుబ్బారావు కుటుంబ సమేతంగా దర్శించారు. వీరిని ఆలయ అర్చకులు సంప్రదాయ ప్రకారం స్వాగతం పలకగా, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజా కార్యక్రమం అనంతరం జేసీ సుబ్బారావు కుటుంబం వేద ఆశీర్వాదం పొందారు. ఆలయ కమిషనర్ వి. సత్యనారాయణ స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనం సత్ఫలితమని జేసీ హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రామలింగరాజు, పారివేక్షకులు విజయ సారధి, సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆలయ నిర్వాహణ బృందం సకల ఏర్పాట్లు సమర్ధవంతంగా నిర్వహించిందని జేసీ అభినందించారు.
అంతర్వేది ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఆలయ అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టాలని జేసీ సూచించారు. ఈ సందర్బంగా స్థానిక భక్తులతో సైతం మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
