ఫ్లెక్సీల వివాదంపై జనసేన నేతల స్పందన

Janasena leaders expressed agreement with Narayana's views on flexies, emphasizing the need for decorum in public displays. Janasena leaders expressed agreement with Narayana's views on flexies, emphasizing the need for decorum in public displays.

ఫ్లెక్సీ ల విషయం లో నారాయణ గారి మాటకి మేం కూడా సమ్మతమే…

మేమేం అతీతులం కాదు ఆయన చెప్పినట్లే వింటాం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో మేము మామూలు సహకరిస్తాం…

ఫ్లెక్సీ రాజకీయంమాత్రమే తెలిసిన వైసీపీ నాయకులు ప్రజల తరిమికొట్టినా వారి పంధాన్ని మార్చుకోలేదు….

జడ్పిటిసి అరుణమ్మ గారి అనుచరులు ఇలా వితండం చేయడం సబబు కాదు…

వివాదాస్పదంగా ఫ్లెక్సీలు కట్టడం వితండ రాజకీయాలు చేయడం పరిపాటిగా మారింది నడుస్తున్నది ప్రజా ప్రభుత్వం మీరు ఇటువంటి చేష్టలు మానుకోవాలి….

నోట్ల కట్టలతో కట్టిన ఫ్లెక్సీలు మా జన సైనికుల రక్తంతో కట్టిన కటౌట్ లకి పోటీ పెట్టకండి…

జనసైనికుల మనోభావాలు దెబ్బతింటే ఎట్లుంటాయో గత ఫలితాలను చూసి తెలుసుకోండి

సింహపురి హాస్పిటల్ ఎదురుగా నగరం ఎంట్రన్స్ నందు ఏర్పరచిన పవన్ కళ్యాణ్ గారి కటౌట్ తొలగించీ తొలగించక ముందే వైఎస్ఆర్సిపి నాయకులు ఫ్లెక్సీలు కట్టడాన్ని వ్యతిరేకిస్తూ జనసేన నాయకులు అక్కడికి చేరుకొని వివాదాస్పదమైన ప్రదేశాల్లో ఫ్లెక్సీలు కట్టరాదని వాటిని తీయించారు…. రూల్స్ గురించి మాకు తెలుసునని కటౌట్ తీసి తీయక ముందే వైసిపి ఫ్లెక్సీలు కట్టడం వివాదాస్పదంగా మారుతుంది అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *