గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం, ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశం గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు సూచన మేరకు, పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. పిడుగురాళ్ల పట్టణంలోని కేఎం కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పొన్నూరు మాజీ శాసనసభ్యులు, నరసరావుపేట పార్లమెంటరీ సమన్వయకర్త కిలారు రోశయ్య హాజరై, ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కిలారు రోశయ్య మాట్లాడుతూ, మార్చి 14న పిఠాపురంలో జరగబోయే ఆవిర్భావ సభ చరిత్ర సృష్టించబోతుందని అన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే మొదటి ఆవిర్భావ సభ ఇది కాబట్టి, జనసైనికులు దీన్ని మహోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు, జనసేన కార్యకర్తలకు, వీర మహిళలకు పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన దిశా నిర్దేశం చేయబోతున్నారని తెలిపారు.
గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు మాట్లాడుతూ, ఆవిర్భావ దినోత్సవానికి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు తరలివెళ్లబోతున్నారని తెలిపారు. 10 సంవత్సరాలుగా జనసేనికులు కలలు కనిన పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా జరిగే ఈ సభను పండుగలా నిర్వహించనున్నట్లు వివరించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బడిదల శ్రీనివాసరావు, అంబటి మల్లి, నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ మునగా వెంకట్, జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాసిం సైదా, మాచవరం మండల అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, దాచేపల్లి మండల అధ్యక్షుడు పాముల కిషోర్, గురజాల మండల అధ్యక్షుడు ఉప్పిడి నరసింహారావు, గురజాల కౌన్సిలర్ చింతకాయల కళ్యాణ్, వీర మహిళలు రమణ, మల్లేశ్వరి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
