అభివృద్ధి పేరిట స్వర్గీయ కాంగ్రెస్ నాయకుడు వైయస్సార్ విగ్రహ దిమ్మెను కూల్చివేసిన నేపథ్యంలో, టిపిసిసి ప్రతినిధి, ఎల్బీనగర్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జక్కడి ప్రభాకర్ రెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గంలోగల కామినేని చౌరస్తా వద్ద ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..కామినేని చౌరస్తాకు కాంగ్రెస్ నాయకులతో ఆయన తరలివచ్చి నిర్మాణ పనులను పరిశీలించి దిమ్మెను కూల్చివేసిన కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ MLA సుధీర్ రెడ్డి ప్రోత్బలంతోనే అధికారులు, కాంట్రాక్టర్లు వైయస్సార్ విగ్రహ దిమ్మెను కూల్చివేశారని వెంటనే అధికారుల స్పందించి వైయస్సార్ విగ్రహాన్ని పునర్నిర్మించిన తర్వాతనే కాంట్రాక్ట్ పనులు మొదలు పెట్టాలని జిహెచ్ఎంసి DE కనకయ్యని ఆయన డిమాండ్ చేశారు.
వైయస్సార్ విగ్రహ దిమ్మె కూల్చివేతపై జక్కడి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం
