వైసీపీ అధినేత జగన్ ఈరోజు నుంచి నాలుగు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకొని, తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళి అర్పిస్తారు. అనంతరం ప్రేయర్ హాల్ లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం కడప నియోజకవర్గ నేతలతో సమావేశమవుతారు.
రేపు ఉదయం 8.30 గంటలకు పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తాతిరెడ్డిపల్లిలో రామాలయాన్ని ప్రారంభిస్తారు. రాత్రికి పులివెందులలో నివాసంలో బస చేస్తారు. 26వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పులివెందుల క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు.
27వ తేదీ ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్ లో జరిగే వివాహానికి హాజరవుతారు. వివాహం తర్వాత పులివెందుల నుంచి బెంగళూరుకు తిరుగుపయనమవుతారు. పర్యటనలో ఆయన పలు ప్రదేశాల్లో ప్రజలను కలుస్తారు.
ఈ పర్యటనలో జగన్ కడప జిల్లాలో ప్రజా సమస్యలను అర్థం చేసుకోవడం, అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం, కీలక నాయకులతో సమావేశమవడం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

 
				 
				
			 
				
			 
				
			