ఘనంగా ప్రారంభమైన అంతర కళాశాలల వాలీబాల్ మరియు కబడ్డీ పోటీలు మరియుఎంపిక ప్రక్రియ. ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాలకొండ నందు,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వారి సమన్వయంతో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. శ్యాంబాబు గారి అధ్యక్షతన అంతర కళాశాలల వాలీబాల్ మరియు కబడ్డీ పోటీలు మరియు ఎంపిక ప్రక్రియ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక పాలకొండ డిఎస్పి శ్రీ ఎం .రాంబాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు .ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ పోటీలు నందు వివిధ అనుబంధ కళాశాల నుండి కబడ్డీ పురుషులు 11, స్త్రీలు 6 మరియు వాలీబాల్ పురుషులు 17, స్త్రీలు 5 జట్లు పాల్గొన్నబోతున్నాయి అని తెలిపారు. ఈ క్రీడా పోటీలు నిర్వహించుటకు అవకాశం కలిగించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఎచ్చెర్ల ఉపకులపతి ప్రొఫెసర్ కె. రేమీ రజిని మరియు రిజిస్ట్రార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమము నిర్వహణలో ఈ మూడు రోజులు బాటు ప్రతిరోజు సుమారు 500 నుండి 600 పైగా క్రీడాకారులకు , విద్యార్థులకు అవసరమైన భోజనాలు , టెంట్లుతో పాటు అన్ని రకాల ఏర్పాట్లకు అవసరమైన ఆర్థికపరమైన సహకారం అందించిన కళాశాల సి. పి. డి. సి సభ్యులు మరియు పాలకొండ మాజీ సర్పంచ్ శ్రీ పల్లా కొండబాబు గారికి కళాశాల తరఫున ధన్యవాదాలు తెలిపారు. అలాగే డి.ఎస్.పి గారు మాట్లాడుతూ క్రీడల నందు జయాపజయాలు సర్వసాధారణమని క్రీడా స్ఫూర్తితో పాల్గొని ఎంపిక ప్రక్రియలు సజావుగా జరగడానికి అన్ని కళాశాలలకు చెందిన విద్యార్థులు సహకరించాలని కోరారు. విశిష్టత అతిధి, విశ్రాంత ఆచార్యులు డాక్టర్ పి.కృష్ణారావు గారు మాట్లాడుతూ క్రీడలు దేహ దారుఢ్యం తో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అందుచేత విద్యార్థులందరూ క్రీడలలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ లు , డాక్టర్ ఎం. శ్రీనివాసరావు, డాక్టర్. ఎ .భాస్కరరావు, పాలకొండ ఎంఈఓ శ్రీ కె సోంబాబు, విశ్రాంత గ్రంథాలయ అధికారి శ్రీ కె .చౌదరి నాయుడు, వ్యాయామ ఉపాధ్యాయులు ఎం రామకృష్ణ, వి పుష్పనాదం, ఆర్ రాములు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి బీ. జయమని, కళాశాల ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ మరియు స్పోర్ట్స్ ఇంచార్జ్ శ్రీ బి. రాజు మరియు వ్యాయామ విభాగాధిపతి మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ. డాక్టర్ ఎస్ సీతారాం, విశ్రాంత వ్యాయామ అధ్యాపకులు శ్రీ టి నారాయణ మూర్తి, శ్రీ కె సూర్య రెడ్డి, వివిధ పాఠశాలలు మరియు కళాశాల నుండి విచ్చేసిన వ్యాయామ విద్య ఉపాధ్యాయులు , ఇతర కళాశాల నుండి వచ్చిన అధ్యాపక సిబ్బంది మరియు అభ్యర్థులు కళాశాల అధ్యాపక సిబ్బంది మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు.
పాలకొండలో అంతర కళాశాలల వాలీబాల్, కబడ్డీ పోటీలు
The inter-college volleyball and kabaddi competitions were inaugurated in Palakonda, organized in collaboration with Dr. B.R. Ambedkar University, featuring various college teams.
