తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “ఇందిరమ్మ ఇండ్ల స్కీం” లో భాగంగా ఘట్కేసర్ లోని SBR ఫంక్షన్ హాల్ లో కమిటీ మీటింగ్ మేడ్చల్ బి-బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ సభ అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్,మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి,పీర్జాదిగూడ మేయర్ అమర్ సింగ్ ఉమ్మడి ఘట్కేసార్ కాంగ్రెస్ లీడర్స్ పాల్గొని ఇందిరమ్మ ఇండ్ల స్కీం కమిటీ మీటింగ్ లో ఇండ్ల లబ్దిదారుల ఎంపికలు విధివిధానాలు వివరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు,కార్పొరేషన్ పార్టీ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శిలు,మేయర్లు,డిప్యూటీ మేయర్లు,వైస్ చైర్మన్,కౌన్సిలర్లు,కార్పొరేటర్లు,మాజీ సర్పంచులు,మాజీ వార్డ్ సభ్యులు,మాజీ ఎంపీటీసీ,మాజీ ఎంపీపీ,మాజీ వైస్ ఎంపీపీ,కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.