సంఘం, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ కల్చూరి అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతీయ కల్చూరి సమాజ్ మహా సభ ను టూరిజం ప్లాజాలో వన్ నేషన్, వన్ కమ్యూనిటీ, వన్ సింబల్ పేరిట నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి శ్రీపాద యశో నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, గౌడ సామాజిక వర్గం లో దేశం మొత్తం లో వివిధ పేర్లతో ఉన్నందరిని ఒకే గొడుగు కిందకి తీసుకొని రావడం లో తెలంగాణలో మొదటి అడుగు పడిందని అభినందించారు.
కేంద్ర మంత్రి ఈ కార్యక్రమం ఉన్నత శిఖరాలకు చేరాలని, తన వంతు సహాయ సహకారం అందిస్తానని అన్నారు. వివిధ రకాల పేర్లతో ఉన్న మన సమాజ్ ను ఏకం చేసేందుకు ఈ ప్రయత్నం నిరంతరం కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ప్రతి సమాజం వారి వారి ప్రయత్నం కొనసాగిస్తూ, దేశం మొత్తంలో మన సమాజానికి కీర్తి పెంచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, తమిళనాడు రాష్ట్ర ఎమ్మెల్యే ఏ ఎమ్ ఎస్ జి అశోకన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ కల్చూరి అసోసియేషన్ అధ్యక్షుడు వి.కుమార్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణరావు గౌడ్, ఆర్ కే ఈ ఎం అర్చన జైస్వాల్, రాజ్ కిషోర్ మోడీ, రాకేష్ జైస్వాల్ కార్పొరేటర్, శైలేందర్ జైశ్వాల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా గౌడ సామాజిక వర్గాన్ని ఏకీకృతం చేయాలని, వారి కళ్చర్, సంప్రదాయాలను మరింత పెంపొందించాలని, మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని నిర్వాహకులు పేర్కొన్నారు.
