వాంఖడేలో న్యూజిలాండ్‌తో భారత్ పోరు ప్రారంభం

In the third Test at Mumbai's Wankhede, India made a strategic change by resting Jasprit Bumrah and including Mohammad Siraj. New Zealand leads the series 2-0. In the third Test at Mumbai's Wankhede, India made a strategic change by resting Jasprit Bumrah and including Mohammad Siraj. New Zealand leads the series 2-0.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జ‌రుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టులో మార్పు చేస్తూ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది. బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు. సిరీస్‌లో ముందుగా రెండు మ్యాచులు గెలుచుకున్న న్యూజిలాండ్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

భారత జట్టుకు ఈ మ్యాచ్‌లో విజయం అత్యవసరంగా ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌కి భారత్ అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌లో గెలవాలి. రోహిత్ శర్మ సేన ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని పట్టుదలగా ఉంది.

జట్లు ఇలా ఉన్నాయి: న్యూజిలాండ్ జట్టుకు టామ్ లాథమ్ నాయకత్వం వహిస్తుండగా, భారత్ తరఫున రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *