IND vs AUS: గోల్డ్‌కోస్ట్‌ టీ20లో తడబడిన భారత్ – ఆస్ట్రేలియాకు 168 పరుగుల లక్ష్యం

India scored 167/8 against Australia in the fourth T20 at Gold Coast

ఆస్ట్రేలియాతో గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న నాలుగో టీ20 (AUSvIND) మ్యాచ్‌లో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. తొలి వికెట్‌ కోసం అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ జంట 56 పరుగులు జోడించి మంచి ఆరంభం ఇచ్చారు.

అభిషేక్‌ 28 పరుగులు చేసి ఔటయ్యాడు. గిల్‌ 46 పరుగులతో రాణించినా, హాఫ్‌ సెంచరీ చేజారింది. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌ ఉన్నాయి.

కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ రెండు సిక్సర్లతో మెరిపించినా కేవలం 20 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. శివం దూబే 18 బంతుల్లో 22 పరుగులు చేశాడు.

ఆఖర్లో అక్షర్‌ పటేల్‌ వేగంగా 11 బంతుల్లో 21 పరుగులు చేయడంతో భారత్‌ 167 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ ముగించింది.

ALSO READ:ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌లో పెను ప్రమాదం తప్పింది – ఒకే ట్రాక్‌పై మూడు రైళ్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *