కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ శారద మాత దేవాలయంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ , ఆలయ అర్చకులు సతీష్ పాండే , అజయ్ పాండే , రమేష్ జ్యోషి , నాగరాజ్ శర్మ , పాండురంగ శర్మ ఆధ్వర్యంలో శ్రీ శారద శరన్నవ రాత్రో ఉత్సవాలు మొదటిరోజు ఉదయం ఐదు గంటల నుండి సుప్రభాత సేవ , గణపతి పూజ , పుణ్యవచనం , ప్రధాన కలశ స్థాపన , అమ్మవారికి పల , పంచామృత అభిషేకం , దివ్య అలంకరణ , మహాగణపతి మూల మంత్ర హోమం , దంపతులచే యజ్ఞహోమం , అర్చనలు అభిషేకాలు మొదటి రోజు శ్రీ బాలాత్రిపుర సుందరి అలంకారంతో భక్తులందరినీ ఆకర్షించుకుంది. గణపతి మూల మంత్ర హోమం , సాయంత్రం సుహాసినులచే కుంకుమార్చన తొమ్మిది రోజులపాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ తొమ్మిది రోజులపాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రతిరోజు నిత్యర్చన అభిషేకాలు , దంపతులచే యజ్ఞ హోమాలు జరుగుతున్నాయని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి , కోశాధికారి సాయి రెడ్డి , ఉపాధ్యక్షులు పెంటయ్య , సభ్యులు రాజ్ గంబీర్ రావు , లింగం , సందీప్ రమేష్, శ్రీనివాస్ , శ్రీ శారద మాత మహిళా కమిటీ బృందం సభ్యులు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
