కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాడు మండలం ఏలూరు,చినశంకర్లపూడి,పెద శంకర్లపూడి గ్రామాల్లో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ గత ప్రభుత్వం పల్లెలను నిర్లక్ష్యం చేసి,పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసింది అన్నారు.
పంచాయతీలకు నిధులు లేకుండా చేసి,సర్పంచులను కేవలం ఉత్సవ విగ్రహాలుగా మిగిల్చింది అన్నారు.రాష్ట్రంలో ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెలు అభివృద్దే ప్రధాన లక్ష్యంగా అడుగులు వేస్తుంది అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎంవిఆర్ కుమార్ బాబు,జనసేన నియోజకవర్గ ఇంచార్జి వరుపుల తమ్మయ్య బాబు,కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్తిపాడు మండలంలో అభివృద్ధి పనుల ప్రారంభం
 MLA Varupula Sathya Prabha inaugurates development works in Prathipadu Mandal, emphasizing village development after NDA coalition's return to power.
				MLA Varupula Sathya Prabha inaugurates development works in Prathipadu Mandal, emphasizing village development after NDA coalition's return to power.
			
 
				
			 
				
			 
				
			