రాంబద్రపురం మండలoఆరిక తోట గ్రామంలో, ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం. గ్రామ సర్పంచి పెంకి భీమయ్య వైఎస్ ఎంపీపీ.పెంకి అరుణ, శేఖర్ ఆధ్వర్యంలో, డప్పు వాయిద్యాలతో, ఘనంగా జరిగింది . సభాధ్యక్షులుగా రిటైర్డ్ ఎంఈఓ జార్జి ఎబినేజర్ వ్యవహరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హాజరై రెండు విగ్రహాలు ఆవిష్కరించారు. చైర్మన్ మజ్జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ,రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశం ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు విగ్రహాలుఆ రిక తోట గ్రామ హైవే ప్రక్కన పెట్టడం చాలా సంతోషం మని అన్నారు.
ఆ మహనీయుల విగ్రహాలు ఆ రిక తోట వంటి పెద్ద గ్రామములో పెట్టడం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాంబద్రపురం మండల అధ్యక్షులు చొక్కా పు. లక్ష్మణరావు, జడ్పిసి సభ్యురాలు. సర్వస్వతమ్మ, వేదాంత డెవలపర్స్. కోట సురేష్, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి జిల్లాల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు పెంకి సుధాకర్ మాదిగ , పెంకి బాబ్జి, రేజేటి. అప్పారావు, జిల్లా దళిత నాయకులు బొద్దా న .అప్పారావు మారిశెట్టి ఆనందరావు, వివద మండలాల వైఎస్ఆర్సిపి నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
ఆరిక తోట గ్రామంలో అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు విగ్రహాల ఆవిష్కరణ
The inauguration of statues of Dr. B.R. Ambedkar and Babu Jagjivan Rao in Arik Thota village was celebrated with enthusiasm.
