పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. అల్ ఖాదిర్ కేసులో కోర్టు ఇమ్రాన్ ఖాన్ మరియు ఆయన సతీమణి బుష్రా బీబీలను దోషులుగా తేల్చింది. ఈ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు 14 ఏళ్ల జైలు శిక్ష మరియు బుష్రాకు 7 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఈ జడ్జిమెంట్ తరువాత, కోర్టు ఇమ్రాన్ ఖాన్‌కు 10 లక్షలు, బుష్రాకు 5 లక్షల పాకిస్థానీ రూపాయల జరిమానా విధించింది.
అడియాలా జైల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య న్యాయమూర్తి తుది తీర్పును చదివారు. ఇమ్రాన్ ఖాన్ మరియు బుష్రా బీబీపై ఆరోపణలు మరింత సీరియస్ గా మారాయి. అల్ ఖాదిర్ ట్రస్టు కేసులో వారు లండన్ లోని పాకిస్థాన్ స్థిరాస్తి వ్యాపారి మాలిక్ రియాజ్ హుసేన్ నుంచి 19 కోట్ల పౌండ్లను తీసుకుని, ఆ సొమ్మును బదిలీ చేయకుండా గోల్ మాల్ చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ సొమ్ము జాతీయ ఖజానాలో జమ చేయకుండా, సుప్రీంకోర్టు ముందు పెట్టిన రియాజ్ హుసేన్ జరిమానా మొత్తంలో కొంత తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీని భద్రతగా, ఇమ్రాన్ దంపతులు అల్ ఖాదిర్ విశ్వవిద్యాలయానికి 57 ఎకరాలు ఇచ్చారని వారు చెప్తున్నారు.
ఇమ్రాన్ ఖాన్ పై ఇప్పటి వరకు 200కి పైగా కేసులు ఉన్నాయని, 2023 ఆగస్ట్ నుండి ఆయన జైలు జీవితం గడుపుతున్నాడు.
