ఎన్టీఆర్‌పై హృతిక్ ప్ర‌శంస‌లు.. వార్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్

Hrithik Roshan praised Jr NTR and confirmed War 2 release date as August 14. Fans are excited after his solid update on the film. Hrithik Roshan praised Jr NTR and confirmed War 2 release date as August 14. Fans are excited after his solid update on the film.

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌పై బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ప్రశంసలు కురిపించారు. ఓ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన హృతిక్‌కి యాంకర్ ‘మీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు?’ అని ప్రశ్నించగా, హృతిక్ తన ఫేవరెట్ కో స్టార్ ఎన్టీఆర్‌నే అని తెలిపారు. అతను గొప్ప నటుడే కాకుండా మంచి వ్యక్తి అని, గోల్డెన్ హార్ట్ ఉన్న మనిషి అని చెప్పారు.

వార్ 2లో ఎన్టీఆర్‌తో కలిసి నటించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని హృతిక్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు అభిమానులు ఎంతో గర్వపడేలా హృతిక్ మాట్లాడిన విధానం టారక్ ఫ్యాన్స్‌కి ఫుల్ ఖుషీని ఇచ్చింది.

ఈ కార్యక్రమంలో హృతిక్ ‘వార్ 2’ రిలీజ్ డేట్‌ను కూడా అధికారికంగా ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా 2025 ఆగస్టు 14న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇది ఆయన అభిమానులకే కాకుండా ఎన్టీఆర్ అభిమానులకు కూడా పెద్ద గుడ్‌న్యూస్ అయింది.

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వార్ 2 చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా, జాన్ అబ్రహాం, కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ తన పాత్ర షూటింగ్‌ను పూర్తి చేసినట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *