నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా ‘హిట్ 3’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా అదిరిపోయే లుక్‌లో కనిపిస్తున్నాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
టీజర్ చూస్తే ఊహించని ట్విస్టులతో నిండిన కథ సాగనుందని అర్థమవుతుంది. శ్రీనగర్‌లో వరుస హత్యలు చోటుచేసుకోవడం, వాటిని ఛేదించేందుకు అర్జున్ సర్కార్ అన్వేషణ ప్రారంభించడం ఆసక్తిగా మారింది. మిక్కీ జె మేయర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఈ సినిమాను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి.
ఊర మాస్ లుక్‌లో నాని కనిపించగా, రావు రమేష్ కీలక పాత్రలో మెరిశారు. అయితే ఇతర పాత్రలను మాత్రం టీజర్‌లో రివీల్ చేయలేదు. అద్భుతమైన విజువల్స్, హార్ట్ పౌండింగ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ‘హిట్ 3’ అంచనాలను పెంచాయి.
ఈ చిత్రానికి శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తుండగా, ‘హిట్ యూనివర్స్’లో మూడో భాగంగా తెరకెక్కుతోంది. నానికి ఇది కొత్త మైలురాయి అవుతుందనడంలో సందేహం లేదు. మరి, అర్జున్ సర్కార్‌గా నాని చూపించే యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి!
