పాలకుర్తి మండలంలోని హరిత హాస్పిటల్ క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న రోగులకు సాహసోపేతంగా వైద్యం అందిస్తోంది. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ, మహిళలకు ప్రత్యేక వైద్యం, గుండె జబ్బులు, షుగర్ వంటి అనేక రకాల వైద్య సేవలు అందించి హాస్పిటల్ ప్రత్యేకతను చాటుకుంటోంది.
హరిత హాస్పిటల్ ఎండి డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ, అత్యంత క్లిష్టమైన రోగులకు మనోధైర్యం కల్పించి మెరుగైన చికిత్సలను అందిస్తున్నామని తెలిపారు. శాతపురం గ్రామానికి చెందిన ఒక మహిళ గర్భాశయం సమస్యతో హాస్పిటల్‌కు రాగా, క్యాన్సర్‌గా నిర్ధారణ చేసి విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించామన్నారు.
ఈ క్యాన్సర్ చికిత్సకు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో 4 లక్షల నుండి 5 లక్షల వరకు ఖర్చవుతుందని, కానీ తక్కువ ఖర్చుతో శ్రీ హరిత హాస్పిటల్‌లో సాయం అందిస్తున్నామని చెప్పారు. నిపుణులైన డాక్టర్ వినోద్ కుమార్ దుస్సా సహకారంతో ఆపరేషన్ విజయవంతమై రోగికి కొత్త జీవితం అందించామని వివరించారు.
గర్భవతుల వైద్యంలోనూ హాస్పిటల్ ప్రతిభ చూపిస్తోంది. పాలకుర్తి గ్రామానికి చెందిన మౌనిక గర్భధారణలో షుగర్ సమస్యతో బాధపడగా, విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి 4 కిలోల బాబును కుటుంబానికి అందించామన్నారు. శ్రీ హరిత హాస్పిటల్‌లో ఈ సేవలన్నీ ప్రత్యేకతగా నిలుస్తున్నాయి.
