పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ నుంచి ప్రేమికుల రోజు స్పెషల్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ‘కొల్లగొట్టిందిరో’ అనే రెండో పాట ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానుంది. మ్యూజికల్ లెజెండ్ ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ఈ పాట రొమాంటిక్ మూడ్‌లో సాగనుంది.
ఈ పాట ప్రకటనతో పాటు మేకర్స్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ లతో కూడిన రొమాంటిక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో పవన్, నిధి అగర్వాల్ ను ప్రేమగా పొగుడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పవన్ వాలెంటైన్స్ డే ట్రీట్ ఇచ్చారంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
‘హరిహర వీరమల్లు’ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి ఎక్కువ భాగం దర్శకత్వం వహించగా, మిగిలిన పనిని నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ పూర్తి చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే మేకర్స్ మార్చి 28న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మ్యూజిక్, విజువల్స్, పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ అన్నీ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టనున్నాయి. ‘కొల్లగొట్టిందిరో’ పాట విడుదలతో సినిమాపై మరింత హైప్ పెరిగే అవకాశం ఉంది.