నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని గుడిసెర్యాల గ్రామంలోకి ఆర్టీసీ బస్సు రావడంలేదని ఎక్స్ రోడ్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు గ్రామంలోని మహిళలు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఘటన స్థలానికి చేరుకొని త్వరలోనే ఆర్టీసీ బస్సు తమ గ్రామంలోకి వచ్చే విధంగా చర్యలు చేపడుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
గుడిసెర్యాల గ్రామస్తుల ఆర్టీసీ బస్సు కోసం ఆందోళన
Women from Gudiseryala staged a protest over lack of RTC bus service. MLA Bojju Patel assured immediate action to resolve the issue.
