స్పీకర్ అయ్యన్నపాత్రునికి ఘన సత్కారం

In Narsipatnam, under the auspices of the Kshatriya Parishad, Speaker Ayanna Patra was grandly felicitated with Vedic blessings on Sunday at his residence In Narsipatnam, under the auspices of the Kshatriya Parishad, Speaker Ayanna Patra was grandly felicitated with Vedic blessings on Sunday at his residence

నర్సీపట్నం, తుని, పాయకరావుపేట, అనకాపల్లి, లింగరాజుపాలెం క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడుని వేద పండితుల వేదాశీర్వచనంతో ఆదివారం ఆయన నివాసం వద్ద ఘనంగా సత్కరించారు.

స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు పేరును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నామకరణం చేసినందుకు, కూటమి ప్రభుత్వం కు మరియు స్పీకర్ అయ్యన్నపాత్రుడుకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయనకు ఈ సత్కారం చేసినట్లు నర్సీపట్నం క్షత్రియ పరిషత్ ప్రెసిడెంట్ గణపతి బంగార్రాజు తెలిపారు.

అలాగే, నర్సీపట్నంలో అనేక ప్రభుత్వ విద్యా సంస్థలు స్థాపించి, నర్సీపట్నంను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దినందుకు క్షత్రియ పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలిపారు.

స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, “నేను చదువుకునే రోజుల నుంచే రాజులతో సత్సంబంధాలు, స్నేహభావం కొనసాగుతున్నాయి. నా ప్రతి ఎన్నికల్లో క్షత్రియ సహాయ సహకారాలు ఉంటాయి,” అని అన్నారు. నర్సీపట్నం బొడ్డేపల్లి పెద్ద మదూమ్ వద్ద ఉన్న రెండు బ్రిడ్జిల మధ్య గల స్థలంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

టూరిజం అభివృద్ధి కొరకు సెంట్రల్ గవర్నమెంట్ 110 కోట్ల రూపాయలు లంబసింగి పర్యాటక ప్రాంతం మరియు అల్లూరి సీతారామరాజు పార్క్, అరుకు బుర్ర గుహలు ఈ నిధులు కేటాయించినట్లు తెలిపారు. అలాగే, గంటం దొర, 12 మంది కుటుంబ సభ్యులకు క్షత్రియ పరిషత్తు మరియు ఎన్ సి సి వారు కొయ్యూరు మండలంలో నిర్మిస్తున్న గృహాలు కట్టి వారికి ఇస్తున్నందుకు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *