చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా సాలూరు శివాజీ బొమ్మ జంక్షన్ వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి, మహానాయకుడిని స్మరించుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గిరిజన సంక్షేమ, శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ చత్రపతి శివాజీ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే గొప్ప యోధుడు అని అన్నారు. ఆయన ధైర్యం, నాయకత్వం, త్యాగం అనుకరణీయమని, ముఖ్యంగా యువత శివాజీ బాటలో నడవాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా, ధర్మ పరిరక్షణ కోసం శివాజీ చేసిన కృషి గొప్పదని కొనియాడారు.
ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శివాజీ గౌరవార్థం పలువురు ప్రసంగిస్తూ ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. విగ్రహానికి పూలమాలలు అర్పించి శివాజీ మహారాజ్ కు ఘన నివాళి అర్పించారు.
జయంతి సందర్భంగా స్థానిక యువత శివాజీ విగ్రహం వద్ద ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారు. దేశభక్తిని కలిగించే పాటలు, శివాజీ జీవిత చరిత్రను వివరిస్తూ ప్రసంగాలు జరిగాయి. ప్రజలు ఉత్సాహంగా పాల్గొని, శివాజీ జయంతిని విజయవంతంగా నిర్వహించారు.