ల్యాబ్ టెక్నీషియన్ సేవలు అనితరసాధ్యమైనవని పలువురు వైద్యులు కొనియాడారు. ల్యాబ్ టెక్నీషియన్ డే వేడుకలు కె.ఎం.ఎల్.ఆర్.టి ఆధ్వర్యంలో అమలాపురం వై.టి నాయుడు స్కానింగ్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్‌ల సేవలను గుర్తించాలంటూ పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన ఐఎంఈ ప్రెసిడెంట్ డాక్టర్ శివకుమార్, సెక్రటరీ డాక్టర్ వై.టి నాయుడు మాట్లాడుతూ, ల్యాబ్ టెక్నీషియన్‌ల ద్వారా అందించబడే రిపోర్ట్ ద్వారానే వైద్యం నిర్ణయించబడుతుందని తెలిపారు. రోగుల వ్యాధిని నిర్ధారించి, వైద్యులకు సరైన సమాచారం అందించడం ద్వారా టెక్నీషియన్‌లు కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.
ప్రస్తుత కాలంలో ల్యాబ్ టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని, కొత్త పరికరాలు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. టెక్నీషియన్‌లు కొత్త మార్గదర్శకాలను తెలుసుకుంటూ, తమను తాము అప్డేట్ చేసుకోవాలని సూచించారు. టెక్నాలజీ అభివృద్ధితో ల్యాబ్ పరిశ్రమ మరింత ప్రాముఖ్యత పెరుగుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కె.ఎం.ఎల్.ఆర్.టి అధ్యక్షుడు ప్రమోద్, సెక్రటరీ సోమేష్, ట్రెజరర్ జి. చంద్రశేఖర్, వైస్ ప్రెసిడెంట్లు బి. మోహన్ కృష్ణ, జి. రామస్వామి, జాయింట్ సెక్రటరీ ఎం. సునీల్ శాస్త్రి, జాయింట్ ట్రెజరర్ ఎం. శ్రీకృష్ణ, మీడియా కోఆర్డినేటర్ వెంకటరమణ, మాజీ ట్రెజరర్ పిల్లా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
