రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి కోడె మొక్కులు చెల్లించి, కేసీఆర్ ఆరోగ్యాన్ని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఆలయం ముందు భారీ స్థాయిలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యకర్తలు మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలనే సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏనుగు మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైందని, ప్రజలంతా ఆయన పాలన తిరిగి రావాలని కోరుకుంటున్నారని అన్నారు.
కార్యక్రమంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి, పార్టీ కార్యకర్తలు, స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రక్తదానం ద్వారా జీవాలను కాపాడే గొప్ప సేవ చేయాలనే సంకల్పంతో ఈ శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వేడుకల్లో చీటి సంధ్య, నిమ్మచెట్టి విజయ్, సిరిసిల్ల చందు, మారం కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండి, మరింత కాలం ప్రజాసేవ చేయాలని ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించారు.