తెలంగాణ మున్నూరు కాపు సంఘం మహిళా శక్తి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం రవీంద్ర భారతి లో బంగారు బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలంగాణ మున్నూరు కాపు సంఘం మహిళా అధ్యక్షురాలు బండి పద్మ నేతృత్వంలో రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో గౌరమ్మను కొలిచారు. మున్నూరు కాపు మహిళా శక్తిని చాటేందుకు ఈ బతుకమ్మ వేడుకలు దోహదము అవుతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంఘం బలోపేతానికి తమ కృషి చేస్తామని, మున్నూరు కాపు మహిళలను సంఘటిత పరిచి, పట్టణ, నగర కమిటీలను వేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్నూరు కాపు సంఘం అపెక్స్ కమిటీ కన్వీనర్ పుటం పురుషోత్తం పటేల్, మంగళారపు లక్ష్మణ్ పటేల్, మున్నూరు కాపు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బాల శ్రీనివాస్, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి మంగబాబు, ఏపీయూడబ్ల్యూజే జనరల్ సెక్రటరీ చందు జనార్ధన్, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోర్స్ ఫోరమ్ వ్యవస్థాపకులు డాక్టర్ బండారి రాజ్ కుమార్, తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల అధ్యక్షులు పి. అరుణ్ కుమార్ పటేల్, వెంకట్ దాదె పటేల్, పటేల్ యూత్ ఫోర్స్ కన్వీనర్లు అఖిల్, సాయి చరణ్, అభిషేక్, నిఖిల్, మహిళా నాయకురాలు మన్యం అరుణ, తోకల నిర్మల, సంధ్యారాణి, తులసి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
బంగారు బతుకమ్మ వేడుకలు వైభవంగా
The Telangana Munnuru Kapu Sangham Women's Power celebrated the Golden Bathukamma festivities with grandeur, uniting women from 33 districts.
