చింతకాయల రాజేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ

Speaker Ayanna Kumar's son, Municipal Counselor Chintakayala Rajesh, celebrated his birthday with family and party members, marked by cake cutting and special prayers. Speaker Ayanna Kumar's son, Municipal Counselor Chintakayala Rajesh, celebrated his birthday with family and party members, marked by cake cutting and special prayers.

స్పీకర్ అయ్యన్న కుమారుడు, మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ……. చింతకాయల రాజేష్ జన్మదిన వేడుకలు అర్ధరాత్రి నుండి ఆత్మీయ వాతావరణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులు పద్మావతి, విజయ్, రాజేష్ సతీమణి దివ్యశ్రీ తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, మిత్రబృందం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. జన్మదినం సందర్భంగా శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు రాజేష్ బాబుకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించి ఆయనకు ఆశీర్వాదాలు అందించారు. ఉదయం నుంచే నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, రాజేష్ ఫాలోవర్స్ పుష్పగుచ్చాలు, కేకులతో రాజేష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *