పసిడి ధరల పెరుగుదల ఇప్పటికీ ఆగలేదు. రోజురోజుకు పెరుగుతూ సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోళ్లు పెరిగాయి. దీంతో గోల్డ్ ధరలకు రెక్కలు వచ్చినట్టుగా మారాయి. వరుసగా రెండో రోజూ బంగారం ధరలు పెరగడం మార్కెట్‌లో చర్చనీయాంశమైంది.
హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరలతో పోలిస్తే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర ప్రస్తుతం రూ. 84,007కి చేరింది. అదే విధంగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 మేర పెరిగి 10 గ్రాములకు రూ. 87,770గా ఉంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తుండటంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బంగారం ధరలు పెరిగిన వేళ, వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. వెండి ధర కిలోకు రూ. 1,07,000గా ఉంది. గత కొన్ని రోజులుగా వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ, తాజా మార్పుతో కొంతమంది వినియోగదారులు వెండి కొనుగోలు వైపు మొగ్గు చూపే అవకాశముంది.
పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కారణంగా గోల్డ్ ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో కూడా ధరలు మారే అవకాశముంది. అందువల్ల త్వరలో బంగారం కొనాలనుకునే వారు తాజా మార్కెట్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.

 
				 
				
			 
				 
				