గజ్వేల్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

The Gajwel Government School's 10th-grade alumni reunion for the 1983-84 batch was held at a private function hall in Gauraram. The Gajwel Government School's 10th-grade alumni reunion for the 1983-84 batch was held at a private function hall in Gauraram.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ పాఠశాల 1983- 84 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం గౌరారంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు, చిన్ననాడు చదువు చెప్పిన అధ్యాపకులను సన్మానించి అనంతరం, చిన్ననాడు చదువుకున్న మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ ఆత్మీయంగా ఆనందంగా గత నాలుగు దశాబ్దాల క్రితం ఒకచోట చదువుకున్న అందరం ఒకచోట కలవడం సంతోషంగా ఉందని భావోద్వేగానికి గురై సంతోషం వ్యక్తం చేశారు, ఇకనుండి ప్రతి సంవత్సరం అందరం ఒకచోట కలుసుకొని కష్టసుఖాలు పాలు పంచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు, ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సత్యనారాయణ నాగేశ్వరరావు, పూర్వ విద్యార్థులు నేతి శ్రీనివాస్, అంబదాస్, తోట బిక్షపతి, గందే రమేష్, ఎన్ సీ శ్రీనివాస్, గంగిశెట్టి సుధాకర్, జే శ్రీనివాస్, పూర్వ విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *