ఖమ్మం జిల్లా ముదిగొండలో పలు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శంకుస్థాపన చేశారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.ముదిగొండ మండలంలో మొత్తం 19.75 కోట్ల రూపాయలతో పలు బిటి రోడ్డు నిర్మాణం పనులకి శంఖుస్థాపన చేశారు.ముందుగా ఆయన ముదిగొండ మండలం చిరుమర్రి నుండి వెంకటాపురం వరకు బిటి రోడ్డు నిర్మాణం కొరకు శంఖుస్థాపన చేశారు.శంఖుస్థాపన చేసిన పనులని త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. ముదిగొండ మండలంలోని మిషన్ భగీరథ పంపు ఆపరేటర్ ల పెండింగ్ వేతనాలను, అతి త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
ముదిగొండలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
