చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ అధికారిక కార్యాలయానికి 6/3/25 గురువారం శంకుస్థాపన జరిగింది. వేటపాలెం బైపాస్ రోడ్‌లోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం సమీపంలో ఈ కార్యాలయానికి రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు, యువ నాయకుడు ఆమంచి రాజేంద్ర ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు ఈ కార్యాలయం నెల రోజుల్లో పూర్తి చేయనున్నట్లు ఆమంచి స్వాములు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఎస్సీ (మాల) కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు రాయపాటి అరుణ, నక్కల రజిని హాజరయ్యారు. అలాగే, జనసేన అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కమిషన్ మెంబర్ వడ్డాణం మార్కండేయులు, చీరాల నియోజకవర్గ ఇంచార్జి శివరామప్రసాద్, రేపల్లె నియోజకవర్గం భాస్కర్, వేమూరు నియోజకవర్గం ఇక్కుర్తి శ్రీను, బాపట్ల నియోజకవర్గం శ్రీమన్నారాయణ, సంతనూతలపాడు నియోజకవర్గం బాబు, చిలకలూరిపేట నియోజకవర్గం రాజా రమేష్, బాలాజీ, వేటపాలెం మండల అధ్యక్షుడు ఉగ్గిరాల మార్కండేయులు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
జనసేన పార్టీ శ్రేణులు, వీర మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చీరాల ప్రాంతంలోని పార్టీ కార్యకర్తలకు కొత్త కార్యాలయం కేంద్ర బిందువుగా మారి, పార్టీ బలోపేతానికి సహాయపడుతుందని నేతలు పేర్కొన్నారు. భవిష్యత్తులో అన్ని కార్యకలాపాలు ఈ కార్యాలయం నుంచే కొనసాగుతాయని తెలిపారు.
ఈ సందర్భంగా, జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 14న పిఠాపురంలో జరగనున్న ఆవిర్భావ సభకు చీరాల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జనసైనికులు తరలి రావాలని నాయకులు శంఖారావం పూరించి, కరపత్రాలు విడుదల చేశారు.
