విడవలూరు మండలంలోని ఊటుకూరు పెద్దపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గ్రామస్తులకు భారీ ఆస్తి నష్టం చోటుచేసుకుంది. సుమారు 15 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించింది.
అగ్ని ప్రమాదం లో బంగారం, కొంత నగదు, గృహపకరణాలు మరియు చాలా మంది దస్తావేదులు, కాగితాలు కూడా అగ్నికి ఆహుతి అయ్యాయి. అయితే, ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
బాధితులు ఇప్పుడు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి ఆర్థిక సహాయం అందించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. వారు తమ నష్టాన్ని తట్టుకునేందుకు ప్రభుత్వ సహాయం అవసరం అని అభిప్రాయపడ్డారు. ఈ అగ్ని ప్రమాదంలో నష్టం జరిగిన కుటుంబాలకు సమాజం మరియు ప్రభుత్వానికి సంయుక్తంగా సహాయం చేయాలనే కోరారు.
