20 రూపాయల కుర్ కురే ప్యాకెట్ ఒక కుటుంబాల మధ్య గొడవ పెట్టింది. కర్ణాటక రాష్ట్రంలోని దావణగెరె జిల్లా చన్నగిరి తాలూకా హొన్నబాగా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. అతీఫుల్లా అనే వ్యక్తి తన కిరాణా షాపులో సద్దాం అనే వ్యక్తి పిల్లలకు కుర్ కురే ప్యాకెట్ అమ్మాడు.
ఆ ప్యాకెట్ ఎక్స్ పైరీ అయినది అని సద్దాం కుటుంబం ఆరోపించడంతో, ఇద్దరు కుటుంబాల మధ్య గొడవ మొదలైంది. ఒక్కసారిగా రెండు కుటుంబాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అతీఫుల్లా కుటుంబం తర్వాత సద్దాం హోటల్ లోకి వెళ్లి అక్కడ ఉన్న వస్తువులను చెల్లాచెదురుగా పడేశారు. ఈ సంఘటనలో పలువురు పరారీలో ఉన్నారు. ఎలాంటి పరిష్కారం లేకుండా రెండు కుటుంబాలు చన్నగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.
అరెస్ట్ భయంతో సుమారు 25 మంది పరారయ్యారు. ఈ ఘటనతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 20 రూపాయల కుర్ కురే ప్యాకెట్ కోసం ఇలా పెద్ద గొడవ జరగడం విచారకరమని వారు చెబుతున్నారు.