జీడీ పిక్కలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే రైతు భరోసా కేంధ్రాలు ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తు జిల్లా వ్యాప్తంగా దశల వారీగా అందోన చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా v. మాడుగుల నియోజకవర్గం, దేవరాపల్లి మండలంలోని జీడీ రైతులతో కలిసి నిర్సన చేపాట్టారు అనంతరం అయిన మాట్లాడారు, అనకాపల్లి జిల్లా లోని జీడీ పంట ప్రధాన పంటగా ఉందని అందులోని దేవరాపల్లి చీడికాడ మాడుగుల రావికమతం రోలుగుంట నర్సీపట్నం గోల్కొండ నాతవరం కోటవుట్ల మండలతో పాటు అత్యదిక మండలాల్లో గిరిజనులు, పేదలు, అత్యధిక మంది జీడీ పైనే అదారపడి జీవిస్తున్నారని తెలిపారు ప్రతి సంవత్సరం పంట చేతికి వచ్చే సమయానికి తెగుళ్లు రావాడం పంటలపై పెట్టిన వేలాది రూపాయలు రైతులు నష్టపోతున్నారని తెలిపారు.
ప్రభుత్వం నుండి మాత్రం ఎటువంటి పరిహారం చెల్లించడం లెదన్నారు కోద్దిగోప్పో పండిన పిక్కలకు గిట్టుబాటు ధర లేక దళారిలు చేతుల్లో మోసపోతు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు 2018-19 సీజన్లో 80 కేజీల బస్తాకు 12 వేల రూపాయిలుకు పైగా ధర పలికిందని,తర్వాత కాలంలో రూ.8,000/- అంత కంటే దిగువకు దిగ జారి పోయిందని తెలిపారు.ఇదే సమయంలో జీడి పప్పు ధర మాత్రం పెరుగుతూ వస్తుందని తెలిపారు కావున 80 కేజీల జీడి పిక్కలకు సగటున జీడి పప్పు దిగుబడి. టోకు ధర అనుస రించి రూ.16 వేల రూపాయిలు మద్దతు ధర ప్రకటించి, ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాలు (RBK)లు ద్వారా కొనుగోలు చేసి జీడి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేసారు. అందుకు శాఖాపరమైన చర్యలకు ఉన్నాతాధికారులకు చర్యలు తీసుకోవాలని,తెలిపారు.
స్థానికంగా పండించిన పిక్కలను కొనుగోలు చేసిన తర్వాతే విదేశీ పిక్కల దిగుమతులకు ప్రభుత్వ అనుమతి ఇవ్వాలి కోరారు. జీడి తోటలలో అంతర కృషి పరికరాలు ఉచితంగా రైతులకు అందించాలని జీడిపరిశోధన కేంద్రాలు ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసి,అభివృద్ధి చేసి నాణ్యమైన మొక్కలు రైతులకు అందించాలని జీడి పంట విస్తరణకు మరియు జీడి తోటలు పునరుద్ధరణకు ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించాలని డిమాండ్ చేసారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఎకరం జీడి తోట అభివృద్ధికి మూడు సంవత్సరాలకు 94 వేల రూపాయిలు రైతులకు క్షేత్ర స్థాయిలో అందించాలని జీడి పంటకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందించాలని, రైతు వారీ సాగు విస్తీర్ణం నమోదు చేసి,జీడి పంటకు వాతావరణ, బీమా అమలు చేయాలని, జీడిపంట ప్రాంతంలో జీడి పిక్కలు, జీడి పం డ్ల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాట్లు చేయాలని, జీడి రైతులకు జీడి పిక్కలు ఆర బెట్టుకోనుటకు టార్పాలిన్లు ఉచితంగా అందించాలని డిమాండ్లు పై ఇప్పటి నుండి వచ్చే సీజన్ వరకు జిల్లా వ్యాప్తంగా దశలవారీగా రైతులతో కలిసి ఆందోళన చేస్తామని ప్రభుత్వ వెంటనే స్పందించి జీడీ రైతులను అన్ని విదాలుగా ఆదుకోవాలని వెంకన్న డిమాండ్ చేశారు. ఈకార్యక్రమం లో కె.రాముడు బి.వెంకటరమణ కాదల దేముడు కె.గణేష్ పి.శ్రీరాం సోములసత్తిబాబు తామార్ల బీమరాజు తోపాటు అదిక సంఖ్యలో గిరిజన రైతులు పల్గోన్నారు.

 
				 
				
			 
				
			 
				
			