విశాఖ డెయిరీ తగ్గించిన పాల ధరను వెంటనే పెంచాలని ఈనెల 29 న విశాఖ డెయిరీ వద్ద జరుగు మీటింగ్ ను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్వవ సాయకార్మిక సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి డి వెంకన్న సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఇరట నరసింహమూర్తి పిలుపు నిచ్చారు,శనివారం రాత్రి వి మాడుగుల మండలం వీరారానారాయణం.గ్రామంలో పాలరైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసారు అనంతరం వారు మాట్లాడారు
విశాఖ డెయిరీ యాజమాన్యం పాల ఉత్పత్తి దార్ల నుండి సేకరిస్తున్న పాల ధరలను తగ్గించడం అన్యాయ మన్నారు,నేడు వ్యవసాయ రంగం లాభ సాటిగా లేక పోవడంతో,యువతి యువకులకు ఉపాధి అవకాశం లెక ఉత్తరాంధ్ర జిల్లాలోని సుమారు 3 లక్షల మంది రైతులు పాడి పై ఆధార పడి ఆవులను మేపు కొని తమకుటుంబాలను పోషించు కుంటున్నారని తెలిపారు ఈరోజు డెయిరీ ఇస్తున్న ధర ఏమాత్రం గిట్టుబాటుగా లేదన్నారు. కనీసంగా ఆవుపాలకు లీటరకు 50 రూపాయలు,గేదె పాలకు లీటరకు 100 రూపాయలు ఇవ్వాలి.కానీ విశాఖ డెయిరీ యాజమాన్యం ఆవు పాలుకి లీటరుకు మూడు రూపాయలు తగ్గించడం వలన పాడి రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు.పశు పోషణ వ్యయం విఫరీతంగా పెరిగినప్పటికీ విశాఖ డెయిరీ యాజమాన్యం పాల సేకరణ ధరలు పెంచ కుండా ధరలను,తగ్గించడం దుర్మార్గ మన్నారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పాల ధరలను పెంచి పాడి రైతులను ప్రోత్సహించాల్సిన విశాఖ డెయిరీ యాజమాన్యం పాల సేకరణ ధరలను తగ్గించడంతో పాడి రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతులతో సంప్ర దించకుండా ఏకపక్షంగా పాల సేకరణ ధర తగ్గించడం సరికాదని తెలిపారు గత రెండేళ్లుగా పాడి రైతులకు బోనష్ ఇవ్వ కుండా తీవ్ర ద్రోహం చేసిందని తెలిపారు.వెంటనే విశాఖ డెయిరీ యాజమాన్యం తన నిర్ణయాన్ని వెనక్కి తీసు కొని తగ్గించిన ఆవు పాల ధరను పునరుద్దరించాలని ఈనెల 29 న.గాజు వాక డెయిరీ వద్ద మూడు జిల్లాల రైతులతో సమావేశం జరుగుతుందని దిన్ని పాల రైతులు జయప్రదం చేయాలని కోరారు ఈకార్యక్రమంలో వ్వవసాయ కార్మిసంఘం జిల్లా నాయకులు బిటి దోర అదిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు
విశాఖ డెయిరీ పాల ధర పెంపుకు రైతుల ఆందోళన
