మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలోని పలు గ్రామాలలో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో దళారులకు ధాన్యాన్ని అమ్మి క్వింటాల్కు 100 రూపాయలు రైతులు నష్టపోవడం జరుగుతుందని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. దళారులకు ధాన్యాన్ని అమ్మోద్దని చెప్పి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ప్రభుత్వం ధాన్యాన్ని మాత్రం కొనడం లేదని దీంతో ప్రైవేటు వ్యాపారస్థులను ఆశ్రయించవలసి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న శంకరంపేట మండలంలోని పలు గ్రామాలలో ఐకెపి మరియు సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. నేటికీ ఆ కొనుగోలు కేంద్రాల వద్ద మాత్రం ధాన్యం సేకరణ మాత్రం జరగడం లేదు వరుడు కరుణించిన రైతులకు మాత్రం ఇబ్బంది తప్పడం లేదు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తే రైతులు బాగుపడతారని అనుకుంటే ప్రస్తుతం ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలలో మాత్రం ధాన్యం సేకరణ జరగడం లేదు పలు కొనుగోలు కేంద్రాల వద్దకు అమాలీలు వచ్చిన, గన్నీ బ్యాగులు వచ్చిన, కొనుగోలు మాత్రం చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందని ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చి పది రోజులుగా ఆరబెట్టిన కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ వర్షం పడితే పది రోజులుగా ఆరబెట్టిన ధాన్యం మొత్తం తడిసి ముద్ద అవుతుందని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం, ధాన్యాన్ని సేకరించకపోవడంలో ఆంతర్యం ఏమిటి అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి కోత కోయడానికి వచ్చిన యంత్రాలకు డబ్బులు ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నామని ఓవైపు కూలీలతో బాల మరోవైపు వరి కోత యంత్రాలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, తప్పని పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించవలసి వస్తుందని, ప్రభుత్వం 2320 క్వింటాలకు చెల్లిస్తామని చెప్పిన, 2200కే విక్రయించవలసి వస్తుందని రైతులు తెలిపారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయనప్పుడు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభించారని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని లేకపోతే రైతులు తీవ్ర స్థాయిలో నష్ట పోవలసి వస్తుందని వారన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతుల నిరాశ
Farmers in Medak district express frustration over the lack of grain purchases at designated centers, forcing them to sell to middlemen at a loss.
