ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం పరిధిలోని టి.నరసాపురం మండలం వెంకటాపురం గ్రామంలో నాటు సారాయి తయారీ స్థావరాలపై 24వ తేదీ ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జక్కుల వెంకట కృష్ణారావు వద్ద రెండు లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేశారు.
అదే మండలంలోని కృష్ణాపురం గ్రామంలో పెద్ద మొత్తంలో పులిసిన బెల్లపు ఊట నిల్వ ఉంచినట్లు గుర్తించారు. సుమారు 900 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను అటవీ ప్రాంతంలో గుర్తించి పూర్తిగా ధ్వంసం చేశారు. అలాగే భూక్యా నాగ ప్రసాద్ ఇంటి ఆవరణలో 200 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను స్వాధీనం చేసుకుని దానిని కూడా ధ్వంసం చేసి అతనిపై కేసు నమోదు చేశారు.
నవోదయం కార్యక్రమం కింద గ్రామ ప్రజలతో అవగాహన సదస్సులు నిర్వహించి, నాటు సారాయి, గంజా, డ్రగ్స్ వంటివి రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రచారం చేశారు. గ్రామస్థులకు మద్యం, డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన ఆపదల గురించి తెలియజేశారు.
ఈ దాడుల్లో అనేక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎక్సైజ్ సి.ఐ పి.అశోక్ మాట్లాడుతూ, ఈ చర్యలు నాటు సారాయి నిర్మూలనలో భాగమని, ఇలాంటి చర్యలు గ్రామాల్లో మరింత చైతన్యాన్ని తీసుకొస్తాయని తెలిపారు.

 
				 
				
			 
				
			 
				
			