పెండింగ్ లో ఉన్న బిల్లుల చెల్లింపుల కోసం ఛలో హైదరాబాద్ పోరాటానికి సిద్దమైన మాజీ సర్పంచులను అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారు. పాలకుర్తిలో తెల్లవారుజామునే పలువురు మాజీ సర్పంచులను అదుపులోకి తీసుకున్నారు. నిరసన హక్కు లేని పరిస్థితిని చూసి మాజీ సర్పంచులు సర్కారు తీరుపై మండిపడుతున్నారు.
మాజీ సర్పంచులు మాట్లాడుతూ, “వారి రావాల్సిన బిల్లుల కోసం శాంతియుతంగా నిరసన తెలపాలనుకుంటే ఇలాంటి నిర్బంధాలు సరికాదు” అంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత నిరసనకే అనుమతినివ్వకుండా అడ్డుపడుతున్న విధానాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
ఈ అక్రమ అరెస్టులపై బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మాజీ జడ్పీటీసీ పుస్కురి శ్రీనివాస్ రావు, ఇతర బిఆర్ఎస్ మండల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తీరును కఠినంగా విమర్శించారు.