ఖమ్మం జిల్లా వేంసూరు తహసిల్దార్ కార్యాలయంలో ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ పై తహసిల్దార్ రాజు దురుసుగా ప్రవర్తిస్తూ, తన క్యాబిన్ నుండి వెళ్లగొట్టి, అరెస్టు చేయిస్తా అని బెదిరించిన ఘటనపై రిపోర్టర్స్ తహశీల్దార్ కార్యాలయం ముందు బయతాయించి నిరసనకు దిగారు. వేంసురు మండలం, ఎర్రగుంటపాడు రెవెన్యూ పరిధిలో ఉన్న గుట్టను గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు చేస్తున్న గుత్తేదారు అనుమతులకు మించి మట్టి తోలకాలు జరుపుతున్న క్రమంలో మట్టి తోలకాల వివరాలు తెలుసుకునేందుకు తహసిల్దార్ కార్యాలయానికి వెళ్ళిన రిపోర్టర్స్ ను తన అటెండర్ తో లోపలికి పిలిపించిన, ఎమ్మార్వో రాజు బెదిరించే ప్రయత్నం చేశారు. అక్రమంగా జరుగుతున్న మైనింగ్ ను అడ్డుకోవాల్సిన ఎమ్మార్వో… సంబంధం లేకుండా ఒక్కసారిగా రిపోర్టర్స్ పై కేకలు వేస్తూ, వారి అక్రిడేషన్లు లాక్కొని, ఫోన్లను లాక్కునే ప్రయత్నం చేస్తూ, పోలీసులు పిలిపించండి అరెస్టు చేయించుదామంటూ కింది సిబ్బందికి ఆర్డర్స్ వేశారు. ఎమ్మార్వో రాజు ప్రవర్తనను నిరసి స్తూ రిపోర్టర్స్ ఎమ్మార్వో కార్యాలయం ముందు నిరసనకు దిగారు. అనంతరం వేంసూరు పోలీస్ స్టేషన్లో తహసిల్దార్ రాజు పై ఫిర్యాదు చేశారు.
ఖమ్మంలో ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ల నిరసన
 Electronic media reporters protest in front of the Vemsoor Tahsildar's office after being threatened by Tahsildar Raju during an inquiry into illegal mining activities.
				 Electronic media reporters protest in front of the Vemsoor Tahsildar's office after being threatened by Tahsildar Raju during an inquiry into illegal mining activities.
			
 
				
			 
				
			