జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ హైదరాబాద్ మరియు వ్యవసాయ శాఖ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో వ్యవసాయ ఉత్పాదక పంపిణీ దారుల డిప్లమో కోర్సులో భాగంగా 48 వారాలపాటు నిర్వహించే శిక్షణ తరగతులలో భాగంగా నేడు మెదక్ జిల్లా డీలర్లకు క్షేత్ర సందర్శన రామాయంపేటలో నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలోనే వినూత్నంగా అతి తక్కువ మంది పండిస్తున్నటువంటి నూతన పంట అయినటువంటి ఖర్జూర సాగు చేస్తూ విజయవంతంగా తన సొంతంగా మార్కెటింగ్ చేస్తున్న అభ్యుదయ రైతు సత్యనారాయణ ఖర్జూర క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా అదనపు సహాయ సంచాలకులు రాజ్ నారాయణ మాట్లాడుతూ మెదక్ జిల్లా సంబంధించిన సుమారు 40 మంది డీలర్లకు విత్తనం దశ నుండి పంట కోత వరకు వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాల లో నూతన సాంకేతిక వ్యవసాయ విధానాలతో పాటుగా విత్తనా పురుగుమందుల ఎరువుల చట్టాలపై సమగ్ర అవగాహన కల్పించడంతోపాటుగా వ్యవసాయంలో సరికొత్త రకాలైనటువంటి వివిధ పంటలను పండిస్తూ విజయవంతమైనటువంటి అభ్యుదయ రైతుల క్షేత్రాలను సందర్శిస్తూ వ్యవసాయంలోని నూతన సాంకేతికత ను డీలర్లకు అవగాహన కల్పించడంతోపాటుగా డీలర్ల ద్వారా వారి వద్దకు వచ్చేటువంటి రైతులకు వ్యవసాయ ఆధునిక సాంకేతిక విజ్ఞానంపై అవగాహన కల్పించడం జరుగుతుందని, రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా స్వల్పకాలిక పంటల కు ప్రత్యామ్నాయంగా దీర్ఘకాలిక పంటలను వేయడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనుసంధానకర్త శ్రీ నరేంద్ర మరియు రైతు సత్యనారాయణ తో పాటుగా వ్యవసాయ విస్తీర్ణ అధికారులు సాయికృష్ణ ప్రవీణ్ మరియు మెదక్ జిల్లాకు చెందిన 40 మంది డీలర్లు పాల్గొన్నారు.
