పేద విద్యార్థుల చదువుకు దాతల సహాయం అవసరం!

GEO representatives urge donors to support poor students’ education, citing financial struggles that may hinder their academic future. GEO representatives urge donors to support poor students’ education, citing financial struggles that may hinder their academic future.

పేద విద్యార్థుల చదువుకు సహాయంగా దాతలు ముందుకు రావాలని గ్లోబల్ ఎంపవర్‌మెంట్ ఆర్గనైజేషన్ (GEO) ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. గురువారం నగరంలోని 80 అడుగుల రోడ్డులోని V-1 రెస్టారెంట్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. 2022లో పేద విద్యార్థులకు విద్యాబలం కల్పించాలనే లక్ష్యంతో ఈ సంస్థను స్థాపించామని, ఇప్పటి వరకు అనేక మంది విద్యార్థులను కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించి విద్య అందించామని తెలిపారు.

సంస్థ ద్వారా ఇప్పటివరకు 32 మంది విద్యార్థులకు చదువు కల్పించామని, అయితే ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని GEO ప్రతినిధులు తెలిపారు. కాలేజీల ఫీజులు చెల్లించేందుకు తాము ఇబ్బంది పడుతున్నామని, అయినప్పటికీ కళాశాల యాజమాన్యాలతో చర్చించి విద్యార్థులకు హాల్ టిక్కెట్లు అందజేశామని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఉన్నత విద్యను కొనసాగించేందుకు ధ్రువపత్రాలు పొందడంలో కూడా కష్టాలు ఎదురవుతున్నాయని తెలిపారు.

దాతలు ముందుకు వస్తే మరికొంత మంది విద్యార్థుల భవిష్యత్తును మార్గదర్శనం చేయగలమని GEO ప్రతినిధులు అన్నారు. వారి సహాయంతో పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుంటారని, ఇప్పటికే లబ్ధిపొందిన వారు కూడా సంస్థకు మద్దతు అందించాలని కోరారు. ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రామాణికంగా విద్యార్థుల ఫీజులు చెల్లించిన రసీదులు భద్రపరిచామని, ఎవరికైనా సందేహాలుంటే సంప్రదించవచ్చని తెలిపారు.

ఈ సమావేశంలో మణిశర్మ, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ GEO ద్వారా లబ్ధిపొందిన విద్యార్థుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని, ఈ సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు అందరూ తోడ్పాటు అందించాలని అభిప్రాయపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు మేము చేయగలిగినంత సహాయం అందించామని, మరింత మంది దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *