డోలపేట రోడ్డు సమస్యతో ప్రజలు అవస్థలు

Residents of Dolapeta village face severe challenges due to the lack of proper road connectivity, affecting access to emergency and healthcare services. Residents of Dolapeta village face severe challenges due to the lack of proper road connectivity, affecting access to emergency and healthcare services.

ఎచ్చెర్ల మండలం డోలపేట గ్రామానికి అతి చిన్న రోడ్డు ఉండడంతో వాహనాల రాకపోకలు కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అయితే గ్రామానికి ద్విచక్ర వాహనాలు తప్ప ఇంకా ఏ వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితి. అయితే గ్రామం నుండి రోగులకు సమీప మండలంలో గల పీహెచ్సీ (PHC)సెంటర్ కు లేదా ఏరియా ఆసుపత్రికి, శ్రీకాకుళం జిల్లా ప్రధాన ఆసుపత్రి కు తీసుకువెళ్ళాలి అంటే 108 అత్యవసర వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. అయితే గ్రామనికి సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మండల, నియోజకవర్గ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు చెప్పేట్టాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *