రాష్ట్రస్థాయి వ్యవసాయ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రామాయంపేట వ్యవసాయ డివిజన్ పరిధిలో డిజిటల్ క్రాఫ్ సర్వే ప్రారంభించారు రామాయంపేట ఇన్చార్జి సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ రామాయంపేటలో నిర్వహిస్తున్న డిజిటల్ క్రాప్ సర్వేను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామయంపేట వ్యవసాయ డివిజన్ వ్యాప్తంగా 14 క్లస్టర్లలో వ్యవసాయ విస్తీర్ణాధికారులు క్షేత్రస్థాయిలో రైతుల యొక్క సర్వే నంబర్లు మరియు సబ్ డివిజన్ల వారీగా డిజిటల్ పంట నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు ప్రత్యేకంగా రూపొందించినటువంటి ఆప్ ద్వారా డిజిటల్ క్రాఫ్ట్ సర్వే నిర్వహించడం జరుగుతుందని క్షేత్రస్థాయిలో ఏర్పడినటువంటి వివిధ సాంకేతికపరమైన ఇబ్బందులను ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేయడం జరుగుతుందని, డిజిటల్ క్రాఫ్ట్ విధానం ద్వారా క్లస్టర్ వారిగా మండలాల వారీగా ఎంత విస్తీర్ణంలో పంటలు పండిస్తున్నారు మరియు దిగుబడి అంచనా మరియు వచ్చే సీజన్ కు సంబంధించి ఎరువులు విత్తనాల ప్రణాళిక చేసుకోవడానికి ఈ డిజిటల్ క్రాఫ్ సర్వే ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రామయంపేట వ్యవసాయ విస్తీర్ణ అధికారి ప్రవీణ్ పాల్గొనడం జరిగింది.
రామాయంపేటలో డిజిటల్ క్రాఫ్ట్ సర్వే ప్రారంభం
 A digital crop survey has been initiated in Ramayampet, overseen by Assistant Agricultural Officer Rajanarayana. The survey helps plan fertilizers and seeds for future seasons.
				A digital crop survey has been initiated in Ramayampet, overseen by Assistant Agricultural Officer Rajanarayana. The survey helps plan fertilizers and seeds for future seasons.
			
 
				
			 
				
			