ఐపీఎల్ 2025 సీజన్‌లో బుధవారం జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్ మ్యాచ్ క్షణక్షణాన మారే ఉత్కంఠను అందించింది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ సమయంలో ధోనీ, కామెంటేటర్ డానీ మోరిసన్ మధ్య జరిగిన సంభాషణ అభిమానుల్లో ఆసక్తి రేపింది. ధోనీ తదుపరి సీజన్‌లో ఆడతాడా అన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన బదులు అభిమానుల హృదయాలను తాకింది.
డానీ మోరిసన్ ప్రశ్నకు ధోనీ స్పందిస్తూ – “తదుపరి సీజన్ సంగతి పక్కన పెడితే, ఈ మ్యాచ్ తర్వాతే ఆడతానో లేదో కూడా తెలియదు” అంటూ చెప్పాడు. ఇది విన్న అభిమానులు అశ్చర్యానికి గురయ్యారు. ధోనీ మాట్లాడేందుకు మైక్ అందుకున్న వెంటనే చెపాక్ స్టేడియం “ధోనీ…ధోనీ…” నినాదాలతో హోరెత్తింది. అభిమానుల ప్రేమకు ధోనీ చిరునవ్వుతో స్పందించాడు.
అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది. పంజాబ్ కింగ్స్ నిలకడగా ఆడి విజయం సాధించగా, సీఎస్కే బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో విఫలమైంది. నిర్ణాయక మ్యాచ్‌గా భావించిన ఈ మ్యాచ్‌లో ఓటమి నేపథ్యంలో ప్లేఆఫ్ అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి.
ఈ పరిణామాలు చెన్నై అభిమానులను నిరాశకు గురిచేశాయి. ధోనీ భవిష్యత్తుపై అస్పష్టత, జట్టు ఓటమి అనే రెండు కీలక అంశాలు ఒక్కరాత్రిలోనే చోటుచేసుకోవడం మ్యాచ్‌కు ప్రత్యేకతను తెచ్చింది. మిగిలిన మ్యాచ్‌లలో సీఎస్కే చారిత్రక రీటర్న్ ఇస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఉంది.