సీఎస్‌కే తరఫున అత్యధిక పరుగులు చేసిన ధోని!

Dhoni creates history in IPL! He surpasses Suresh Raina to become CSK’s highest run scorer. Dhoni creates history in IPL! He surpasses Suresh Raina to become CSK’s highest run scorer.Dhoni creates history in IPL! He surpasses Suresh Raina to become CSK’s highest run scorer.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. నిన్న ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ధోనీ, సురేశ్ రైనా రికార్డును అధిగమించి సీఎస్‌కే తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ధోనీ 236 మ్యాచ్‌ల్లో 4,699 పరుగులు చేశాడు. మునుపటి రికార్డు సురేశ్ రైనా (4,687 పరుగులు) పేరిట ఉండేది.

ఇక సీఎస్‌కేపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు 33 ఇన్నింగ్స్‌ల్లో 1,084 పరుగులు చేసి, శిఖర్ ధావన్ (1,057) రికార్డును అధిగమించాడు. తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (896), దినేశ్ కార్తీక్ (727), డేవిడ్ వార్నర్ (696) ఉన్నారు. నిన్నటి మ్యాచ్‌లో కోహ్లీ 30 బంతుల్లో 31 పరుగులు చేశాడు.

కాగా, నిన్న చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 50 పరుగుల తేడాతో ఆర్‌సీబీ చేతిలో ఓటమి చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 196/7 పరుగుల భారీ స్కోర్ చేయగా, లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై 146/8 మాత్రమే చేయగలిగింది. ధోనీ చివర్లో 16 బంతుల్లో 30 పరుగులు చేసి మెరుపులు మెరిపించినా, జట్టును గెలిపించలేకపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *